ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 32 మంది ప్రాణాలో కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9:15 గంటలకు యమ్ ఎల్ మార్నింగ్ బర్డ్ అనే పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ పడవ మరొకపడవను ఢీకొట్టడంతో దీనిలోకి నీరు చేరుకున్నది. పడవ సామర్థ్యం ప్రకారం 45 మంది ప్రయాణికులను మాత్రమే వెళ్లాలి.. కానీ మరికొంత మంది ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడం, వేరొక పడవను ఢీ కొట్టడం వలన ఈ ఘటన చోటు చేసుకుంది ” అని కమాండర్ గోలం సాడేక్ తెలిపారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు.
- June 30, 2020
- Archive
- జాతీయం
- ACCIDENT
- BANGLADESH
- BOAT
- DHAKA
- బురిగాంగ నది
- శ్యాంబజార్
- షేక్ హసీనా
- Comments Off on పడవబోల్తా.. 32 మంది మృతి