ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘రుద్ర’ సినిమా నిర్మించాలని గత రెండేళ్లుగా అనుకుంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ డ్రామాగా స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అదితీ రావు హైదరీని హీరోయిన్గా కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అది కొంత నిజమే అయినా లేటెస్ట్గా ధనుష్ పట్టువీడని విక్రమార్కుడిలా కథలో మార్పులు చేర్పులూ చేసి బడ్జెట్‌కు అనుకూలంగా మరో ప్రొడ్యూసర్‌తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నాడట.
ప్రస్తుతం బాలీవుడ్లో భారీ క్యాస్టింగ్‌తో పాన్ ఇండియా మూవీగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్న అక్కినేని త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు అటెండ్ కానున్నాడట. భారీ చారిత్రాత్మక చిత్రంగా ‘రుద్ర’ను ధనుష్ తెరకెక్కించేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ సినిమాకు హీరోగా మొదట రజినీకాంత్ ను అనుకున్నారట. కానీ కథ పరంగా నాగార్జున సూటవుతాడని నాగ్‌ను ఎంచుకోవడం జరిగిందట. ఇప్పటివరకూ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఈసారి మాత్రం ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేయాలని ధనుష్ భావిస్తున్నాడట. త్వరలోనే ధనుష్ నుండి రుద్రకు సంబంధించిన అప్ డేట్ వస్తుందనుకుంటున్నారంతా.