Breaking News

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ 25న డ్రాఫ్ట్, డిసెంబర్ 1న డ్రాఫ్ట్ ఎలక్ట్రోరోల్ పబ్లికేషన్ చేపట్టి 12వ తేదీ వరకు అభ్యంతరాలుంటే పరిష్కరించుకోవచ్చని వివరించారు. జనవరి 18న చివరి జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు 2017 నవంబర్​ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. నేరుగా తమ డిగ్రీ మెమో, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు, రెండు పాస్ ఫొటోలను తీసుకువెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.