Breaking News

పక్కాగా పారిశుద్ధ్య పనులు

సారథి న్యూస్, కొల్చారం: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో మూడవ విడత పల్లెప్రగతి పనులను గ్రామాల్లో పక్కాగా చేయాలని సర్పంచ్​లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కొల్చారం ఎంపీడీవో వామన్​రాఉ సూచించారు. గురువారం మెదక్​ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్ల, వై.మాందాపూర్, కోనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. పల్లెప్రగతి పనుల అమలు తీరును గమనించి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో మురికి కాల్వల్లో పూడికతీత, గుంతల పూడ్చివేత పనులను దగ్గరుండి పరిశీలించాలని సూచించారు. గ్రామస్తులు తడిపొడి చెత్తను వేరుచేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలన్నారు. వాటితో కంపోస్ట్​ ఎరువులను తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి, వై.మాందాపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్​రెడ్డి, కోనాపూర్ సర్పంచ్ రమేష్​ పాల్గొన్నారు.