- మెదడు సంబంధిత వ్యాధులపై ప్రయోగాలు
- ఈ ఏడాది చివరిలో మనుషులపై చేస్తామంటున్న పరిశోధన సంస్థ
టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ రెండు నెలల క్రితం గెట్రూడ్ అనే పందిపిల్ల మెదడులో 23 వ్యాసం పరిమాణంలో ఉన్న కంప్యూటర్ చిప్‌ను పెట్టారు. దీనికోసం హెల్దీగా ఉన్న పిల్లను ఎంచుకున్నారు. మనుషుల్లో బ్రెయిన్ సంబంధిత వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వాటిని నయంచేసే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. అంటే పందిపిల్ల మెదడులోకి చొప్పించిన ఈ న్యూరో లింక్ ద్వారా దానికి మెదడులో సంభవించే మార్పులను సేకరిస్తారు.
2016లో శాన్ఫ్రాన్సిస్కోలో న్యూరోలింక్ ఎయిమ్స్ ను మస్క్ స్థాపించారు. వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ చిప్ ఒకదాన్ని తయారుచేసి పందిపిల్ల మొదడులోకి అమర్చాడు. ఈ చిప్‌లో వెంట్రుక కంటే సన్నని వేలాది ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటి ద్వారా నాడీ సంబంధితమైన అల్జీమర్స్, డిమెన్షియా, వెన్నెముక గాయాలు వంటివి తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా మతి మరుపు, వినికిడి శక్తి కోల్పోవడం, పార్కిన్సన్, డిప్రెషన్, నిద్రలేమి.. తదితర సమస్యలను సైతం మెదడులో ఇంప్లాంట్ చేసిన చిప్ ద్వారా పరిష్కరించవచ్చని మస్క్ అంటున్నారు.
ఈ ఏడాది చివరిలో మనుషులపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ముందుగా పక్షవాతంతో బాధపడుతున్న కొందరు పేషెంట్లలో ఈ చిప్‌లను అమరుస్తామని న్యూరోలింక్ ఎయిమ్స్ సంస్థ హెడ్ డాక్టర్ మాథ్యూ మెక్‌డౌగల్ తెలిపారు. అయితే న్యూరోలింక్ ఎయిమ్స్ వేసిన ఈ ముందడుగు గురించి జాగ్రత్తలు వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నారు నూర్యో సైంటిస్టులు. తమ కంపెనీ మూడు పందుల మెదళ్లలో రెండేసి చొప్పున చిప్‌లను పెట్టామంటున్నారు మస్క్. ఇంతకు ముందు చిప్ ఇంప్లాంట్ చేసిన పంది ఆరోగ్యంగా ఉందని.. సాధారణ పందితో పోలిస్తే ఎలాంటి తేడా లేదని అది చాలా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉందంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా మెదడు సంబంధిత వ్యాధులు ఎలా నయమవుతాయో వేచిచూడాలి మరి.