Breaking News

పంటమార్పిడి తప్పనిసరి

సారథి న్యూస్, నర్సాపూర్: రైతులు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నియంత్రణ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని మహమ్మద్ నగర్, సలాబత్ పూర్ గ్రామాల్లో సదస్సులను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ..దేశంలో పప్పుదినుసుల పంటల సాగు తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం భారం పడుతుందని, కనుక రైతులు పప్పు దినుసు పంటల పైన మక్కువ చూపాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సారా రమగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఏడీఏ బాబు నాయక్, కేవీపీ శాస్త్రవేత్త నరేష్, ఎంపీడీవో కోటిలింగం, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఎంఏఓ పద్మావతి, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్ పాల్గొన్నారు.