చంఢీగర్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్ మంత్రి రాజిందర్ సింగ్ బజ్వాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యుల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. కాగా పంజాబ్‌లో మంగళవారం నాటికి 8,551 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు.
- July 15, 2020
- Archive
- జాతీయం
- షార్ట్ న్యూస్
- CARONA
- MINISTER
- PANJAB
- కరోనా
- మంత్రి
- Comments Off on పంజాబ్ మంత్రికి కరోనా