సారథి న్యూస్, వెల్దండ: వెల్దండ మేజర్ పంచాయతీని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శ్రీధర్ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. గురువారం ఆయన వెల్దండ మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. పక్కాగా పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలంలో నాటేందుకు హరితహారం మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి బాగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. కలెక్టర్ వెంట స్థానిక సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, డీపీవో సురేష్ మోహన్, ఆర్డీవో రాజేష్‌కుమార్, ఎంపీపీ విజయజైపాల్, ఏపీడీ గోవిందరాజులు, చారకొండ ఎంపీడీవో జయసుధ, కార్యదర్శి వికాస్ ఉన్నారు.
- June 5, 2020
- Archive
- Top News
- మహబూబ్‌నగర్
- NAGAKURNOOL
- VELDANDA
- కలెక్టర్ శ్రీధర్
- పల్లెప్రగతి
- Comments Off on పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి