Breaking News

నోరా.. ఔరా!

సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఇన్​స్టాగ్రామ్

మోడల్, సింగర్, డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్​ తో కలిసి ఇట్టాగే రెచ్చిపోదాం.. అంటూ ఆడి పాడి తెలుగువాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. తర్వాత ‘కిక్ 2’, ‘షేర్’, ‘లోఫర్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్​ లో ‘భుజ్ ది ప్రైడ్’లో సినిమా చేస్తోంది. సినిమా ఆఫర్లు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్​ను అలరిస్తూనే ఉంటుంది. అయితే నోరా ఇప్పుడు ఇన్​స్టా గ్రామ్​లో ఏకంగా 13మిలియన్ల ఫాలోవర్స్ అభిమానాన్ని సంపాదించి సెంట్రల్ ఫిగర్ అయిపోయింది. ఫ్రెంచ్ మోడల్ మోంటానా తర్వాత స్థానంలో ఉంది నోరా. ప్రస్తుతం ప్రపంచంతా ఆమె వైపే చూస్తోంది.

వరల్డ్​ లోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నా నోరా ఇలా అంటోంది.. ‘‘ఇన్​ స్టాగ్రామ్​ నెట్​ వర్క్​ సోషల్ మీడియాలో అతిపెద్దది. ఇంతమంది ఫాలోవర్స్​ను సంపాదించాలంటే చాలా కష్టం. ఇలా నాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయని అనుకోలేదు.. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణమైన అభిమానులకు, స్నేహితులకు, నన్ను సపోర్ట్ చేస్తున్న సన్నిహితులకు అందరకూ హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ నోరా ఇన్​ స్టాగ్రామ్​ ద్వారానే తన థ్యాంక్స్ చెప్పింది. ఇకనైనా నోరాకు హీరోయిన్ ఆఫర్లు వస్తాయేమో చూద్దాం..