స్టాక్హోమ్: కరోనా మహమ్మారి ప్రబలుతున్న కారణంగా ఏటా నోబుల్ బహుమతుల గ్రహీతలకు ఇచ్చే విందును రద్దు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో చెప్పింది. ఏటా అవార్డు గ్రహితలతో పాటుసుమారు 1300 మందికి స్టాక్హోమ్లో విందును ఇస్తారు. ఈ సారి అవార్డులు ప్రకటిస్తామని, కానీ ఆడియన్స్ లేకుండా బాంకెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 10న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 1956లో హంగేరీ సోవియెట్ యూనియన్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మాత్రమే ఈ విందును రద్దు చేశారు. ఆ తర్వాత రద్దు చేయడం ఇదే. 1901 నుంచి ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు వీటిని ప్రకటిస్తారు.
- July 22, 2020
- Archive
- జాతీయం
- NOBEL
- SOVIETUNION
- STOCK
- నోబెల్
- సోవియెట్ యూనియన్
- స్టాక్హోమ్
- Comments Off on నోబెల్ విందు రద్దు