న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యే రెజ్లర్ బజ్రంగ్ పూనియాకు నేరుగా కోచింగ్ ఇస్తేనే కచ్చితమైన ఫలితాలను రాబట్టగలమని అతని కోచ్ షాకో బెంటెనిడిస్ అన్నాడు. రెజ్లర్‌కు కోచింగ్ ఇచ్చేందుకు ఎప్పుడెప్పుడు భారత్‌కు వద్దామని ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఒకవేళ బజ్రంగ్ మెడల్ బౌట్లో తలపడితే.. భారత్‌తో పాటు సగం జార్జియా అతనికి మద్దతు ఇస్తుందన్నాడు. ‘బజ్రంగ్.. నాకు కొడుకుతో సమానం. ఒలింపిక్స్ కోసం అతన్ని అన్ని విధాలుగా సిద్ధం చేయాలి. సాంకేతికతను ఉపయోగించి చేయడం ద్వారా ఫలితాలు బాగా రావు. అందుకే నేరుగా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నా. రెజ్లింగ్ శారీరక క్రీడ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని బెంటెనిడిస్ వివరించాడు. ప్రస్తుతానికి వీడియో కాల్స్, మెయిల్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నా.. ఫిజికల్‌గా ఇచ్చే సలహాలు, సూచనలు ఆటలో మెరుగవ్వడానికి చాలా దోహదం చేస్తాయన్నాడు. ఇప్పటికైతే బజ్రంగ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని తెలిపిన బెంటెనిడిస్.. అతడు మరింత శ్రమించాలన్నాడు.
- June 20, 2020
- Archive
- క్రీడలు
- COACHING
- OLYMPIC
- PUNIA
- WRESTLING
- బెంటెనిడిస్
- భారత్
- Comments Off on నేరుగా కోచింగ్ ఇవ్వడమే బెటర్