Breaking News

నేను గుర్తున్నానా..?

నేను గుర్తున్నానా..?

‘రాఖీ రాఖీ రాఖీ నా కావసాకీ’ అంటూ ఎన్టీఆర్ సినిమాలో తన గొంతు వినిపించిన మమతా మోహన్​ దాస్​ మలయాళ కుట్టీ మీకు గుర్తుందా? చింతకాయల రవి, యమదొంగ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలే చేసింది. అద్భుతమైన నటనను ప్రదర్శించే ఈ అమ్మడు అంతకంటే అద్భుతంగా పాడుతుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్​లో ఉండగానే ప్రజీత్​ ను పెళ్లాడింది. తర్వాత కేన్సర్ మహమ్మారి చుట్టేసింది మమతను. ట్రీట్​మెంట్​ అంటూ చాలాకాలం గ్యాప్ తీసుకుంది.

కేన్సర్​ను జయించి గతేడాది ‘అనియాంకుజమ్ తన్నాలయత్తు’ సినిమాలో హే డిడ్లే డిడ్లే పాటతో రీఎంట్రీ ఇచ్చింది. ‘బ్యూటీ విత్ స్ట్రాంగ్ హార్ట్’ అని పిలుచుకునే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. అందాలను ప్రదర్శించే విషయంలో ఏ మాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో టచ్​లో ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో తన హాట్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. మీరు కూడా ఆమె ఫ్యాన్స్ అయితే ఓ లుక్కేసేయండి మరి.