న్యూఢిల్లీ: తాను క్షేమంగా ఉన్నానని బాలీవుడ్ నటి హేమమాలిని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందని, వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నానని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చూసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలే. దయచేసి నా ఆరోగ్యం విషయంపై వదంతులు పుట్టించకండి. నాకు ఏమైనా ఇబ్బంది కలిగితే స్వయంగా నేనే చెప్తా. నా శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు ఇటువంటి వార్తలు నమ్మకండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
- July 12, 2020
- Archive
- జాతీయం
- సినిమా
- BOLLYWOOD
- CARONA
- HEMA MALINI
- RUMORS
- SOCIAL MEDIA
- క్షేమం
- హేమమాలిని
- Comments Off on నేను క్షేమంగా ఉన్నా.. పుకార్లు నమ్మకండి