సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఈనెల 7న సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి క్యాంపు ఆఫీసు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లావ్యాప్తంగా గర్భిణులు 38,258 మంది, బాలింతలు 42,259 మంది, లక్ష మందికిపైగా చిన్నారులు లబ్ధిపొందుతారని వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం కిట్‌ను అందజేస్తారని పీడీ భాగ్యరేఖ వెల్లడించారు.
- September 6, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- ICDS PD
- Kurnool
- YSR SAMPURNA POSHANA
- అంగన్ వాడీ
- ఐసీడీఎస్ పీడీ
- కర్నూలు
- వైఎస్సార్సంపూర్ణ పోషణ
- Comments Off on నేడు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం