సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్ శంకర్, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ శాఖ వైస్ ప్రెసిడెంట్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DEVOLOPMENT
- NEW PROJECT
- SINGARENI
- SOLAR
- WATER
- గోదావరిఖని
- సింగరేణి
- Comments Off on నీటిపై సోలార్ ప్రాజెక్టులు