సారథి న్యూస్, హుస్నాబాద్: పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు కన్నెర్ర చేశారు. తమకు పూర్తి పరిహారం చెల్లించేవరకు పనులు చేసుకోనివ్వబోమంటూ అడ్డగించారు. సిద్దిపేట జిల్లా గూడాడిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు పునరావాస ప్యాకేజీ డబ్బులు చెల్లించలేదని వారు వాపోయారు. అధికారులు సంతకాలు తీసుకొని సంవత్సరం కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు వినలేదు. ఆందోళన చేస్తున్న నిర్వాసితులకు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేశ్, వివిధ పార్టీల నేతలు హన్మిరెడ్డి, వనేశ్, సత్యనారాయణ, భాస్కర్, లింగమూర్తి, రాజిరెడ్డి, శ్రీనివాస్, అయిలయ్య, మల్లికార్జున్ రెడ్డి, వీరాచారి, నరేష్ రాజిరెడ్డి, సంపత్, శంకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాములు, తిరుపతి రెడ్డి, మహిళలు, 300 మంది భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
- July 10, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GOURAVELLI
- HUSNABAD
- RDO
- SIDDIPRT
- అధికారులు
- గౌరవెల్లి
- Comments Off on నిర్వాసితుల కన్నెర్ర