Breaking News

నిర్మాతగా హరీశ్​ శంకర్

టాలీవుడ్​లో హీరోలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లుగా మారుతున్న విషయం తెలిసిందే. ఈసారి నిర్మాతగా హరీశ్​ శంకర్ కూడా వారి లిస్టులో చేరనున్నాడు. హరీశ్​ శంకర్ నిర్మాత అంటూ ప్రచారం జరుగుతోంది. హరీశ్​ బన్నీ వాసుతో కలిసి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించబోతున్నాడట. ఒక సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని.. గీతా ఆర్ట్స్​తో కలిసి ఈ సినిమాను చేయాలనుకుంటున్నాడని టాక్. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అటు సినీవర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగానే ఉండే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. క్రిష్ తో పాటు మరికొందరు రచయితలతో కలిసి పవన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా ఇటీవలే హరీశ్​ శంకర్ చెప్పుకొచ్చాడు. పవన్ వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో సినిమాలు పూర్తిచేసిన తర్వాత హరీశ్​ శంకర్ మూవీని చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో వీరి కాంబినేషన్​లో మూవీ పట్టాలెక్కి 2022 లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.