Breaking News

నియంత్రత సాగు లాభసాటి

  • నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఈ.శ్రీధర్​

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: తెలంగాణ సోనా రకం సాగుచేయాలని, మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలను వేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ. శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నియంత్రిత పంటల సాగు.. పంటమార్పడి విధానంపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్​ అధికారులపైనే ఉందని సూచించారు. శనివారం స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలని, నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు పూర్తిస్థాయిలో క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మొక్కజొన్న సాగుచేయొద్దని, ప్రత్యామ్నాయంగా పత్తి, కంది, నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫామ్ ఆయిల్ పంటను సాగుచేయాలని సూచించారు. ఈనెల 25న జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించి పంటల సాగుపై ఒక విధానపరమైన నిర్ణయంతో ముందుకు సాగుతామని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి, డీఏవో బైరెడ్డి సింగారెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్​ చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.