‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కీర్తిసురేష్. అప్పటి నుంచి తన సినిమాలన్నీ ఆచితూచి ఎన్నుకుంటోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా రవీంద్రనాథ్ శర్శ డైరెక్షన్ లో ‘మైదాన్’ స్పోర్ట్స్ బయోపిక్ ఒకటి, తెలుగులో నితిన్ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్లక్ సఖి’, నరేంద్ర నాథ్ డైరెక్షన్లో ‘మిస్ ఇండియా’ సినిమాలు.. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘అన్నాత్త’, ‘పెంగ్విన్’ సినిమాలు కాగా మలయాళంలో ‘మరక్కర్’ సినిమా కూడా చేస్తోంది.
ఇవి కాక మళ్లీ నితిన్ తో కలిసి మరో సినిమా చేస్తోందట. ‘రంగ్ దే’ సినిమా తర్వాత నితిన్ వరుసగా మూడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందులో కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిని సంప్రదించగా సై అందట. అంతేకాదు ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీస్తారట. ఇకపై వరుస ఆఫర్లతో కీర్తి ఫుల్ బిజీ అయిపోనుంది.