సారథి న్యూస్, రామాయంపేట: కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలో
నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె పేర్కొన్నారు.
- August 19, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- LOCKDOWN
- NIJAMPET
- SARPANCH
- కరోనా
- లాక్ డౌన్
- సర్పంచ్
- Comments Off on నిజాంపేటలో 31 వరకు లాక్డౌన్