సారథిన్యూస్, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్ఫీల్డ్ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు బందోబస్తు కల్పిస్తున్నారు. కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, తల్లాడ తహసీల్దార్ గంట శ్రీలత సర్వేను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో అలజడులకు తావులేకుండా ప్రశాంతంగా సర్వే జరుగుతుంది. గ్రామస్థులంతా సర్వేకు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పారు.
- June 30, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KAMMAM
- MAOIST
- POLICE
- TALLADA
- ఖమ్మం
- పోలీసులు
- Comments Off on నిఘా నీడలో..