సారథి న్యూస్, అనంతపురం: ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలకఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ వైఎస్సార్ ఫొటోను జతచేశారు.
YS Jagan Mohan Reddy
✔
@ysjagan
Nanna is my strength and inspiration in my every stride. Fathers strive, motivate, give love and support to see their children succeed. He is our first and best friend, mentor and hero with whom we share many precious moments. Happy #fathersday to all the great fathers out there!