క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం ‘వి’ చిత్రంతో విడుదలకు రెడీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు నాని. అలాగే ‘ట్యాక్సీవాలా’ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ తన మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతీ తెలిసిందే. ‘జెర్సీ’చిత్రాన్ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. మూడు డిఫరెంట్ గెటప్స్ లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నాడని, నాని కోసం ముగ్గురు హీరోయిన్స్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట చిత్రయూనిట్ వాళ్లు.
మొదట ‘ఎంసీఏ’లో నానితో జోడీ కట్టిన సాయిపల్లవిని సంప్రదించగా.. ఓకే చెప్పిందట. కానీ మరో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను అప్రోచ్ అవగా సోలో హీరోయిన్ గా అయితే ఓకే.. ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలో నటించడం కుదరదు అందట. దాంతో మళ్లీ ఇద్దరి హీరోయిన్స్ గురించి సెర్చింగ్ మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్, శోభిత ధూళిపాళ్లను ఎంపిక చేసినట్లుగా సమాచారం. దాదాపు ఈ ముగ్గురు హీరోయిన్లు కన్ఫామ్ అయినట్లే అని టాక్ వినిపిస్తోంది కానీ ఇంకా దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించ లేదు.