సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాచారుపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా సకల వసతులతో ఇళ్లు ఇచ్చామన్నారు. ‘గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా సీఎం కేసీఆర్ వరం ఇచ్చారని’ లబ్ధిదారులు కొనియాడారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ కల్పన నర్సింలు, పంచాయతీరాజ్ శాఖ డీఈ వేణు, డీఆర్డీవో గోపాల్ రావు పాల్గొన్నారు.
- July 31, 2020
- Archive
- Top News
- మెదక్
- DOUBLE BEDROOM
- NACHARUPALLY
- SIDDIPET
- నాచారుపల్లి
- మంత్రి హరీశ్‌రావు
- సిద్దిపేట
- Comments Off on నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు