సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్ తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపూర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన ఉపాధ్యాయుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొల్లాపూర్ ఎస్బీఐలో పనిచేసే క్యాషియర్ కు, అటెండర్ కు కరోనా సోకింది.
- July 19, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- CARONA
- HOSPITAL
- NAGARKURNOOL
- NEWCASES
- కరోనా
- నాగర్‌కర్నూల్
- Comments Off on నాగర్‌కర్నూల్ జిల్లాలో 13 కొత్తకేసులు