సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు పిల్లలను ఐసోలేషన్ కు తరలించారు. వారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలకు పాజిటివ్ అని వచ్చింది. కానీ ఆమె భర్త మాత్రం రిపోర్ట్ వచ్చింది. దీంతో నల్లగొండలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు పెరిగింది. ఇందులో ఆరుగురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు.