సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: నడిగడ్డకు కరోనా కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గురువారం వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదుకావడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కేంద్రంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ముగోనిపల్లి గ్రామంలో ముగ్గురు, గద్వాల టౌన్ లో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
Red zone