శృంగార తార మియా మాల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ అనే చిత్రాన్ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఎలా ఉన్నా రూ.వంద టికెట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు. దీనితో లేట్ చేయకుండా ఆర్జీవీ మరోసారి ప్రేక్షకుల వీక్ నెస్ ను వాడుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ‘నగ్నం’ అనే చిన్న సినిమాను ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళిని కాదు.. ఇది ‘ఆర్ఆర్ఆర్’ కాదు ఇది ‘ఎన్ఎన్ఎన్’ అంటూ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా ‘నగ్నం’ సినిమా నుంచి ట్రైలర్ 2 రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ లో ఒకటినుంచి మించి చూపించాడు.
కెమెరాతో కాంప్రమైజ్ లేదు అంటూ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలకు జనాలకు షాక్ వచ్చేట్టు ఉంది. కెమెరాను రకరకాల యాంగిల్స్‌లో పెడుతూ క్రేజ్ పెంచుకునేందుకు కష్టపడ్డాడు అనిపిస్తోంది. రొమాంటిక్ ప్రియులను ఇట్టే ఆకర్షించేలా ఉన్న ఈ ట్రైలర్ ఆ టైపు సినిమాలను కోరుకునే వారిని బాగానే ఎంటర్టైన్ చేసేలా ఉంది. హీరోయిన్ను రొమాంటిక్‌గా చూపించే సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ గా శ్లోకాన్ని కూడా వాడాడు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ వెర్షన్లలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నాడు. అయితే ‘క్లైమాక్స్’ సినిమాకు రూ.వంద పెట్టిన వర్మ ఈసారి మాత్రం రూ.200 టికెట్ ధరగా నిర్ణయించాడు. ఈ ‘ఎన్ఎన్ఎన్’ కూడా ‘క్లైమాక్స్’ సినిమా మాదిరిగానే ఆర్జీవీ వరల్డ్ లో జూన్ 27న రాత్రి 9 గంటలకు రిలీజ్ కాబోతోందని ప్రకటించాడు. మరి ఈ చిన్న సినిమాను ఎంతమంది చూస్తారో చూడాల్సిందే.