Breaking News

నకిలీ సీడ్స్​ విక్రయిస్తే కటకటాలే

సారథి న్యూస్​, గోదావరిఖని: రైతులకు నకిలీ సీడ్స్​ విక్రయించే వారిపై చర్యలు తప్పవని, అటువంటి వ్యాపారులపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని డీజీపీ మహేందర్​రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో వాటిని అమ్మాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్​ నుంచి డీజీపీ మహేందర్​ రెడ్డి అన్ని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. లాక్ ​డౌన్​ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ టెస్టింగ్​ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్, సీసీఆర్బీ సీఐ రాజనర్సయ్య, సీసీఎస్ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు, సతీష్​, కిరణ్​ పాల్గొన్నారు.