సారథి న్యూస్, బిజినేపల్లి : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠినచర్యలు తప్పవని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ హెచ్చరించారు. గురువారం ఆయన బిజినేపల్లిలోని కనక దుర్గ ఏజెన్సీ , శ్రీరామ ట్రేడర్స్ , వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నీతితో కలిసి తనిఖీచేశారు. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ప్యాకెట్ పై తయారీ తారీఖును , బిల్లును కచ్చితంగా సరి చూసుకోవాలని కోరారు.
- June 11, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- AGRICULTURE
- INSPECTIONS
- TAGS: SEEDS
- రైతులు
- లైసెన్స్
- Comments Off on నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే