కొద్ది కాలంగా యువరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మోక్షజ్ఞ స్టడీస్ పూర్తి కాలేదని.. తాను సినిమాల్లో నటించేందుకు అప్పుడే ఇంట్రెస్ట్ చూపడం లేదని ఆ పనిని వాయిగావేశారు యువరత్న బాలకృష్ణ. కానీ దీన్ని సాకుగా తీసుకున్న కొంతమంది మోక్షజ్ఞకు అసలు సినిమాల్లో నటించడం ఇష్టమే లేదంటూ ప్రచారాలు చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అది నిజమే సుమా అనుకున్నారు మరికొంత మంది. కానీ అదేమీ కాదని మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రానికి సమయం ఆసన్నమైందన్న టాక్ ఈసారి బలంగా వినిపిస్తోంది. నందమూరి నటవారసుడు అవసరం మేర రూపు రేఖలను మార్చకుంటూ, నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని త్వరలోనే అతని ఎంట్రీ ఉంటుందని క్లారిటీగా తెలుస్తోంది. అంతేకాదు మంచి కథతో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ తీసుకున్నాడని సమాచారం. మెగాస్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ రైటింగ్ టీమ్ లో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ లాంటి భారీచిత్రానికి రచయితగా కొనసాగుతున్నారు. దీంతో పాటే పలు క్రేజీ చిత్రాలకు పనిచేస్తున్నారు.
- June 6, 2020
- Top News
- సినిమా
- BALAKRISHNA
- MEGASTAR
- నందమూరి బాలకృష్ణ
- బుర్రా సాయిమాధవ్
- మోక్షజ్ఞ
- రాజమౌళి
- Comments Off on నందమూరి వారసుడొస్తున్నాడు