మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో మాజీ సారథి ధోనీ ఓ దిగ్గజమని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. క్రికెట్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసిన ఓ గొప్ప పండితుడని కొనియాడాడు. ‘మహీ దిగ్గజం, మిస్టర్ కూల్. క్రికెట్ కోసమే పుట్టాడు. ఆట అంటే అతనికి పిచ్చి’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. జట్టులో మహీ ఉండడం విరాట్‌కు కొండంత అండని చెప్పాడు. ఇక ఇప్పుడున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా.. అత్యుత్తమ ఫీల్డర్ అని స్మిత్ కితాబిచ్చాడు. యువతరం క్రికెటర్లలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆకట్టుకుందన్నాడు.‘జడేజా ఫీల్డింగ్ సూపర్బ్. అథ్లెటిక్ విన్యాసాలతో బంతిని వేగంగా ఆపగలుగుతాడు.
టీమ్‌లో అతను ఉంటే 30 నుంచి 40 పరుగుల వరకు కాపాడతాడు. క్యాచ్‌ల విషయంలో జడ్డూకు తిరుగేలేదు. ఊహించని క్యాచ్‌లు పట్టడంలో అతనికెవరూ సాటిరారు. రాహుల్ బ్యాటింగ్‌లో బాగా రాటుదేలాడు. ఇప్పుడు టీమ్‌లో రెగ్యులర్ మెంబర్ అయ్యాడు. బ్యాటింగ్ స్టయిల్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసు. వయసు చిన్నదే అయినా.. పరిణతితో కూడిన బ్యాటింగ్ చేస్తాడు. ఫ్యూచర్లో మరింత గొప్ప బ్యాట్స్‌మెన్‌గా తయారవుతాడు’ అని స్మిత్ పేర్కొన్నాడు.