కోలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలోనే ‘పటాస్’ తో హిట్ అందుకున్నాడు ధనుష్. తెలుగులో ఆ సినిమా ‘లోకల్ బాయ్’గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ధనుష్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ‘జగమే తంత్రమ్’ చిత్రం చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రిలీజైన ఈ మూవీ మోషన్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ మూవీలో ధనుష్ గ్యాంగ్స్టార్గా డిఫరెంట్స్ గెటప్స్ లో కనిపించనున్నాడని అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్.
జూలై 28న ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అదేరోజు ఈ చిత్రంలోని ‘రకిట రకిట’అనే సాంగ్ కూడా విడుదల చేయనున్నారట. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు విడుదల చేయనున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోమని థియేటర్ లోనే విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీగా చెప్పారు.