సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవంపై నిషేధం విధించినట్లు పోలీసులు ప్రకటించారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో ఫైట్ చేస్తుంటారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది చనిపోయిన, గాయపడిన ఘటనలు ఉన్నాయి. విజయదశమి రోజు దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి కోసం భీకర పోరు జరుగుతుంది. దీన్ని బన్ని ఉత్సవం అని పిలుస్తారు. చిమ్మ చీకటిలో దివిటీల వెలుగులో వేలాది మంది కర్రలతో హోరాహోరీగా తలపడుతారు. తలలు బద్దలు కొట్టుకుంటూ మాలమల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెడతారు. ఇప్పటికే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
- October 26, 2020
- Archive
- BUNNYFIGHT
- DEVARAGATTU
- Kurnool
- MALAMALLESHWARASWAMY
- కర్నూలు
- కర్రల యుద్ధం
- దేవరగట్టు
- మాలమల్లేశ్వరస్వామి
- Comments Off on దేవరగట్టు సమరానికి బ్రేక్