వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. ఆ చిత్రంతో మాస్ హీరోగా ఎలివేట్ అయినా తరువాత చేసిన సినిమాలు లవ్ ఎంటర్ టెయినర్సే. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా పూర్తి స్థాయి లవ్ ఎంటర్ టైనర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ఎన్నారై యువకుడిగా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఇంకా కంప్లీట్ అవక ముందే అఖిల్ ఇంకో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాల దర్శకుడు వీరు పోట్ల ఇటీవల అఖిల్‌కు ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో అఖిల్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. స్టార్ డైరక్టర్లతో సినిమాలు చేసినా హిట్ దక్కలేదు అఖిల్కి. అందుకే ఇలా రూటు మార్చాడని.. అంతగా హిట్లు లేకుండా వెనకబడి ఉన్న డైరెక్టర్స్ మీదే తన ఫోకస్ పెట్టాడని కొందరంటుంటే.. కథ బాగుంటే విజయం అదే వస్తుందని.. ఇంతకు ముందు ఈ డైరెక్టర్స్ కూడా విజయాలు అందుకున్నవారే కాబట్టి.. అఖిల్ అంచనాలు సక్సెస్ అవుతాయేమో చూడాలి మరి.
- July 16, 2020
- Archive
- సినిమా
- AKHIL
- VV VINAYAK
- అఖిల్
- పూజా హెగ్డే
- వివి వినాయక్
- Comments Off on దూసుకెళ్తున్న బ్యాచిలర్