Breaking News

దీపికాను ఇరికించిన వాట్సాప్​గ్రూప్​

బాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్​, సారా అలీఖాన్​, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్​, నమ్రతా శిరోద్కర్​ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్​సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్​ ప్రీత్​సింగ్ ఎన్​సీబీ ( నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను శుక్రవారం ఎన్​సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్​సీబీకి పలు కీలక వివరాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాను దీపికా, సుశాంత్​సింగ్​ మేనేజర్​ జయ సాహా కలిసి ఓ వాట్సాప్​ గ్రూప్​ ఏర్పాటు చేసుకున్నామని కరిష్మా ఎన్​సీబీకి చెప్పిందట. అయితే ఈ గ్రూప్​కు దీపికానే అడ్మిన్​గా ఉండేదని.. ఈ గ్రూప్​ కేవలం డ్రగ్స్​ కోసమే పెట్టుకున్నామని ఆమె ఎన్​సీబీకి చెప్పిందని సమాచారం. దీపికా తరుచూ డ్రగ్స్​గురించి అడిగేదని కరిష్మా అధికారులకు చెప్పిందట. ఈ మేరకు పలు జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరంతా కలిసి 2017 లో చేసిన చాట్ కు సంబంధించిన పలు వివరాలు ఆమె అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. శనివారం దీపికా పదుకొనే.. ఆమె మేనేజర్​ కరిష్మా .. ఎన్​సీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరిని ఎదురెదురుగా కూర్చొబెట్టి నిజాలు రాబట్టనున్నట్టు టాక్​. ప్రస్తుతం సుశాంత్​ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, సుశాంత్​ మేనేజర్​ జయసాహో, దీపికా పదుకొనే మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ చెప్పిన వివరాల ప్రకారం విచారణ సాగుతున్నది. అయితే ఈ కేసులో మరికొందరు ప్రముఖులు తెరమీదకు రావొచ్చని సమాచారం.