సారథి న్యూస్, మెదక్: దివ్యాంగులు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారాలు స్థాపించుకుని స్థిరమైన ఆదాయం పొంది సాధారణ జీవనాన్ని గడపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకంలో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరం దివ్యాంగులు 24 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.13.6 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో 19 యూనిట్లకు రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. 80శాతం రాయితీతో ఐదు యూనిట్లకు రూ.లక్ష లోపు బ్యాంక్ లింకేజీ రుణాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న దివ్యాంగులు ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు https://tsobmms.cgg.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- January 6, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- LOANS
- medak
- SELF EMPLOYEEMNET
- WOMENWALFARE
- దివ్యాంగులు
- మహిళాశిశుసంక్షేమశాఖ
- మెదక్
- Comments Off on దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు