Breaking News

‘దారి’ చూపండి సార్లూ..!

‘దారి’ చూపండి సార్లూ..!

సారథి న్యూస్, పెబ్బేర్: రాజకీయ నాయకులు ఆ ఊరు వైపునకు ఓట్లకు తప్ప ఏనాడూ కన్నెత్తిచూడరు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా పట్టించుకోరు..! వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఆ ఊరుకు వెళ్లే రోడ్డంతా బురదమయంగా మారింది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఏనాడూ 108 అంబులెన్స్ ​వచ్చిన దాఖలాల్లేవ్. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలం తాటిపాముల పంచాయతీకి మూడు కి.మీ. దూరంలో ఉన్న తాటిపాముల తండా(కుంటివానితండా)కు ప్రధాన రహదారి తెగిపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తండాకు పోవాలంటే కిలోమీటర్​దూరంలో వాహనాలను ఆపివేసి నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇటీవల ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అంబులెన్స్​రాలేని పరిస్థితుల్లో మంచంపైన తీసుకెళ్లారు. ‘గ్రామ పంచాయతీ నుంచి మమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరూ రాలేదు. ఓట్లకు అడగడానికి వస్తే మళ్లీ ఓట్లకు మాత్రమే వస్తారని’ తండా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.