Breaking News

దాదా, కోహ్లీ.. ఒకేలా

న్యూఢిల్లీ: క్రికెట్ ఆడే తీరు వేరైనా.. కెప్టెన్సీలో గంగూలీ, కోహ్లీ ఒకేలా వ్యవహరిస్తారని టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ సారథ్యం అందుకున్నాడు. తనకున్న నాయకత్వ లక్షణాలతో టీమ్​ను చాలా మెరుగుపర్చాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఫిట్​నెస్, ఫీల్డింగ్ ​లాంటి అంశాల్లో దాదాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగని లోపాలు లేని వారు ఎవరుంటారు? టీమ్​కు మంచి సారథి అవసరమైన దశలో పగ్గాలు అందుకుని అందర్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అదే దారిలోనే పయనిస్తున్నాడు. భావోద్వేగాల విషయంలో దాదా ఎక్కువగా బయటపడడు. ఒకటి, రెండుసార్లు మాత్రమే బయటపడ్డాడు. కానీ విరాట్ అలా కాదు. ఆట అంటే అతనికి పిచ్చి. ఎమోషనల్​గా ఉన్నా చాలా కంట్రోల్​గా ఉంటాడు. ప్రజలు దీనిని అతి అనుకుంటారు. అది తప్పు. కేవలం దూకుడు మాత్రమే. అదే అతడిని ముందుకు తీసుకెళ్తుంది. ఆటపైనే దృష్టిపెట్టేలా చేస్తుంది’ అని వెంకీ పేర్కొన్నాడు.