సారథి న్యూస్, నర్సంపేట: దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పాడి గేదేల పంపిణీ కింద రూ.17.70కోట్లను విడుదల చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో ఆరంభించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ జరుగనునన్నట్లు తెలిపారు లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 60శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. విజయ డెయిరీ వారి అనుసంధానంతో అగ్రిమెంట్ లో పేర్కొన విధంగా లీటర్ పై రూ.4 అదనంగా ఉత్పత్తిదారులకు చెల్లించనున్నారు. 27 పాల ఉత్పత్తి సెంటర్లలో పాలను సేకరించడానికి 80 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్రాలీ వాహనాలను కూడా అందిస్తోందన్నారు.
- July 26, 2020
- Archive
- వరంగల్
- షార్ట్ న్యూస్
- DAIRY
- MILK
- SUBCIDY
- డెయిరీ
- పాలు
- సబ్సిడీ
- Comments Off on దళితుల అభ్యున్నతే ధ్యేయం