Breaking News

దమ్ముంటే.. ఆరోపణలు నిరూపించండి

దమ్ముంటే... ఆరోపణలు నిరూపించండి


సారథి న్యూస్, కర్నూలు: పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో డబ్బు వసూలు చేసి కొత్త వారిని నియమించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేసే వారు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ పార్టీ నాయకులే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉండి సేవచేస్తానని, వీలైనంత సాయం చేస్తానే తప్ప కీడు చేయనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ స్పష్టంచేశారు. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవాని, ఎవరూ చెప్పుడు మాటు నమ్మొద్దన్నారు.
కార్మికుల జీవితాలతో ఆటలా..?
ఒప్పంద కార్మికు నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి వర్గీయులకు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ వర్గీయులు సవాల్‌ విసిరారు. పాత కార్మికులను తొలగించి.. కొత్త వారిని నియమించేందుకు ఎమ్మెల్యే డబ్బు వసూలు చేశారని కొందరు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మంగళవారం వైఎస్సార్​సీసీ జిల్లా నాయకులు జొహరాపురం ఒప్పంద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్​సీపీ టౌన్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు మల్లికార్జున, చందు, విజయ్‌ కుమార్‌, నవీన్‌ మాట్లాడుతూ.. నగర కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌ ట్రాక్టర్‌ యాజమాని కింద పని చేసే కార్మికును గత కమిషనర్‌ రవీంద్రబాబు తొగించారని, వారిని రోజువారీ కూలీలుగా గుర్తింపునిస్తూ .. అవసరమైనప్పుడు పనికి పిలుచుకునేలా మాట్లాడారని, కానీ కొందరు ఈ విషయంపై కావానే ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌పై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కమిషనర్‌ తొగించిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఎమ్మెల్యే డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తూ గత వారంలో ధర్నా చేశారని, దీని వెనక మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి వర్గీయు జొహరాపురం నాయకు కుట్రపన్నారన్నారు. నగర ఎమ్మెల్యే ప్రతిష్ట దెబ్బతీసేందుకే… ఇలాంటి చౌకబారు రాజకీయాకు దిగజారుతున్నారని, స్వార్థ రాజకీయా కోసం కార్మికు జీవితాతో ఆటలాడుతారా.. అని ఘాటుగా ప్రశ్నించారు.