Breaking News

దంపతులపై చిరుతదాడి

సారథి న్యూస్​, అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని ఊటుకుంట వద్ద మామిడి తోటలో నిద్రిస్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. లక్ష్మమ్మ, కుల్లాయప్ప దంపతులు తోటలో ఉండగా చిరుత ఒక్కసారిగా వచ్చి దాడిచేసింది. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం పుట్టపర్తి సత్యసాయి జనరల్​ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మమ్మ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి తిరుపతి రొయ్య ఆస్పత్రికి తరలించారు. ఈఘటనతో బుచ్చయ్యగారిపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.