సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.
- August 30, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MLA KORUKANTI
- MUHARRAM
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే కోరుకంటి
- మొహర్రం
- రామగుండం
- లింగాపూర్
- Comments Off on త్యాగాలకు ప్రతీక మొహర్రం