తెలంగాణలో 6 కరోనా కేసులు
– 464 మంది డిశ్చార్జ్.. 552 మందికి చికిత్స
– ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1044 కరోనా కేసులు నమోదయ్యాయని, వారిలో చికిత్స అనంతరం 464 మందిని డిశ్చార్జ్ చేశామని, శుక్రవారం 22 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 552 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 మంది చనిపోయారని పేర్కొన్నారు.
రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాలను కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రంలో ఉన్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వివరాలను కేంద్రం ప్రకటించింది.
రెడ్‌జోన్ జిల్లాలు..
మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్, హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలను ప్రకటించారు.
ఆరెంజ్‌జోన్ జిల్లాలు..
నిజామాబాద్, జోగుళాంబ గద్వాల, నిర్మల్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగామ, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలను పేర్కొన్నారు.
గ్రీన్‌జోన్ జిల్లాలు..
పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి జిల్లాలుగా వెల్లడించారు.