Breaking News

తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్

తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తురక కాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుచేసి, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేయాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, తురక కాశ సంక్షేమ సంఘం (టీకేఎస్​ఎస్​) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాసులు మైనారిటీ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది తురక కాశ ముస్లింలు ఉన్నానని, వారు బండలు, రాళ్లు కొడుతూ దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని వివరించారు. ఎలాంటి రక్షణ సాధనాలు లేకుండా బండలో రాళ్లు కొడుతున్న సందర్భంగా బండలుపైన పడి మరణిస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి వికలాంగులుగా మారుతున్నారు. కళ్లల్లో పొడిపడి అంధులుగా మారుతున్నారని అన్నారు. వీరు గుట్టప్రాంతాలు, మారుమూల పల్లెల్లో జీవిస్తున్నారని, వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని, అభివృద్ధికి ప్రత్యేకమైన పథకాలు రూపొందించాలని కోరారు. అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేయాలని, యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చి వేరే వృత్తుల్లోకి చేరేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తిచేశారు.