సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు తీన్మార్మల్లన్నపై దాడిని ఖండిస్తున్నామని జైభీమ్యూత్ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై తీన్మార్ మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేనివారే దాడులకు పాల్పడుతారని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అనైతిక పనులు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. మల్లన్నపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- July 13, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- JAIBHEEM YOUTH
- TEENMAR MALLANNA
- జైభీమ్యూత్
- తీన్మార్ మల్లన్న
- ముకురాల శ్రీహరి
- Comments Off on తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం