హాండ్సమ్ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్ డౌన్ లేకుంటే ఈసారి రిలీజ్ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఇస్మార్ట్ రామ్ మదిలో తమిళ చిత్రరంగం వైపు మనసు మళ్లిందట. బేసికల్ గా రామ్ చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ భాషతో మంచిపట్టుంది కూడా. అందుకే ఆ పరిశ్రమ అన్నా, తమిళీయులన్నా తనకు ప్రత్యేక అభిమానమని, అందుకే అక్కడ కూడా సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. దానికోసం చర్చలు కూడా మొదలుపెట్టాడట. తమిళీయులకు కూడా మన తెలుగు హీరోలంటే అభిమానమే. నాగార్జున, బన్నీ, మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా ఆదరిస్తారు వాళ్లు. మరి వీళ్లలాగే రామ్ కూడా కోలీవుడ్ లో ఇక ముందు వాళ్ల అభిమానాన్ని కూడా పొందనున్నాడు.
- May 23, 2020
- Archive
- ISMARTSHANKAR
- RAM
- తాడం
- నివేదా పేతురాజ్
- మాళవికశర్మ
- రెడ్
- Comments Off on తమిళంలోనూ చేయాలి