పదమూడేళ్ల క్రితం ‘ఢీ’తో ఎంటర్ టైన్ చేసిన మంచు విష్ణు, శ్రీనువైట్ల.. మళ్లీ ఇన్నాళ్లకీ ‘ ఢీ అండ్ ఢీ’ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో విష్ణుకి జోడీగా ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఢీ’ సినిమాలో జెనీలియా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈసారి కామెడీ, యాక్షన్ డబుల్ రేంజ్‌లో ఉంటాయని ముందే చెప్పిన విష్ణు.. గ్లామర్ ను కూడా డబుల్ డోస్ లో చూపించడానికి ప్రగ్యా జైస్వాల్, అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే, రష్మిక మందన్న, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా మాత్రం వీళ్లిద్దరినే ఫిక్స్ చేసినట్లు సమాచారం. శ్రీనువైట్ల, మంచు విష్ణు కూడా వీరిద్దరికీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ వచ్చే చాన్స్ ఉంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవరమ్ భక్త మంచు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రచయిత గోపీమోహన్, మరో రైటర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైటర్స్ గా పనిచేస్తున్నారు. మహతి సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
- December 28, 2020
- Archive
- సినిమా
- 24 FREMS FACTORY
- 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
- DEE
- MANCHU VISHNU
- SRINU VAITLA
- ఢీ
- ఢీ అండ్ ఢీ
- మంచు విష్ణు
- శ్రీను వైట్ల
- Comments Off on ‘ఢీ’కి డబుల్ డోస్