Breaking News

డ్రైవర్​ ప్రాణం కాపాడిన పోలీస్​

TRAFFIC POLICE

సారథి న్యూస్ , నల్లగొండ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడో ట్రాఫిక్​ పోలీస్​.నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్​టవర్​ సెంటర్​లో హఫీజ్ ట్రాఫిక్​ పోలీస్​గా పనీచేస్తున్నాడు. బుధవారం ఓ వాహనదారుడు కారులో రాంగ్​రూట్​లో వస్తుండగా.. హఫీజ్​ అతడి కారును ఆపాడు. తాను చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవరుగా పని చేస్తున్నట్టు డ్రైవర్​ తెలిపాడు. హైదరాబాద్​ నుంచి నల్లగొండ వైపు వస్తుండగా.. చిట్యాలకు వచ్చినప్పటి నుంచి ఛాతిలో నొప్పి వస్తున్నదని.. అందుకే రాంగ్ రూట్ లో వచ్చినట్లు చెప్పడంతో వెంటనే స్పందించిన ట్రాఫిక్​పోలీస్​ హఫీజ్​ అతడిని స్థానిక సురక్ష దవాఖానకు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడి వైద్యుల సూచనల మేరకు బాధితుడిని హైదరబాద్​ తరలించారు. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిని హఫీజ్​ను జిల్లా ఎస్పీ రంగనాథ్​ అభినందించారు.