బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ. నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, శనివారం మరో ముగ్గురు హీరోయిన్లు.. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ను వేర్వేరుగా విచారించింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అదుపులోకి తీసుకున్నామని తాజాగా నలుగురు హీరోయిన్ల స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు వెల్లడించారు అధికారులు.
- September 27, 2020
- Archive
- Top News
- జాతీయం
- DEEPIKAPADUKONE
- DRUGS CASE
- SARAALIKHAN
- SRADDAKAPOOR
- డ్రగ్స్ కేసు
- దీపికా పదుకొణె
- శ్రద్ధాకపూర్
- సారా అలీఖాన్
- Comments Off on డ్రగ్స్ కేసులో హీరోయిన్ల ఫోన్లు సీజ్